క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం

క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం
యశోదలో హైపర్ సైట్ మిషన్‌తో ఖచ్చితమైన చికిత్స
మహబూబ్ నగర్, ఆర్కే న్యూస్ ప్రతినిధి :
Cancer చికిత్సలో మరో కీలక అడుగు ముందుకు పడిందని డాక్టర్ టీ. స్రవంతి రెడ్డి తెలిపారు.
మంగళవారం మహబూబ్ నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, Yashoda Hospitalsలో హైపర్ సైట్ (HyperSight) అనే ఆధునిక మిషన్‌ను క్యాన్సర్ చికిత్సలో వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఈ మిషన్ సహాయంతో రోగి శరీరంలో క్యాన్సర్ కణజాలం ఉన్న ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి, ఆ ప్రాంతానికే రేడియేషన్ కిరణాలను పంపించడం సాధ్యమవుతుందని తెలిపారు.
దీంతో క్యాన్సర్ కణజాలానికి సమీపంలో ఉన్న ఆరోగ్యకర కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా చికిత్స అందించవచ్చని చెప్పారు.
అలాగే, చికిత్స అనంతరం సాధారణంగా కనిపించే అనేక దుష్ప్రభావాలను తగ్గించడంలో ఈ మిషన్ సహాయపడుతుందని పేర్కొన్నారు.
క్యాన్సర్ చికిత్సలో హైపర్ సైట్ మిషన్ ఒక సరికొత్త అధ్యాయం అని డాక్టర్ స్రవంతి రెడ్డి అభిప్రాయపడ్డారు.